డిగ్రీ కళాశాలలో క్లైమేట్ యాక్షన్ డే

W.G: క్లైమేట్ యాక్షన్ డే కార్యక్రమాన్ని చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలు అధ్యక్షతన జరిగింది. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాలుష్యం తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, చిన్న చిన్న అలవాట్లలో మార్పులు తీసుకుంటే పర్యావరణానికి పెద్ద సహాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు.