మంచు తెరల చాటున సూర్యుడు

మంచు తెరల చాటున సూర్యుడు

అనకాపల్లి: కోటవురట్ల మండంలో మంచు ప్రభావం మొదలైంది. సోమవారం ఉదయం మంచు దట్టంగా కురుస్తోంది. మంచుతో పాటు చలి తీవ్రత పెరిగింది. సంక్రాంతి సమయానికి ఎక్కువగా కురిసే మంచు ఇప్పడు కార్తీక మాసం ప్రారంభంలోనే పడుతోంది. కాగా, ఉదయం పొలాల వద్ద కురుస్తున్న మంచు, మంచు తెరల చాటున ఉదయిస్తున్న సూర్యుడు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.