CMRF చెక్కులను పంపిణీ చేసిన MLA
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు MLA పాయల్ శంకర్ శనివారం CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజలకు వరం లాంటిదని అన్నారు. వైద్య ఖర్చుల వివరాలను MLA క్యాంపు కార్యాలయంలో సమర్పించి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.