పూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
MNCL: జన్నారం మండలంలో ఏర్పడిన ఇసుక సమస్యతో భారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. జన్నారం మండలంలో మొత్తం 757 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే ప్రస్తుతం 20 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అదే సమయంలో మరో 737 ఇళ్లు బేస్మెంట్, లెంటల్, రూఫ్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మండలంలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో దాదాపు 90% ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది.