నేను పార్టీ మారడం లేదు: ఎమ్మెల్యే
HYD: తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను BRS ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 'నా వయస్సు 73 ఏళ్లు, ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో నాకు బాగా తెలుసు' అని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని ఎద్దేవా చేశారు.