గోల్డ్ మెడల్ అందుకోబోతున్న విద్యార్థిని
SRCL: సిరిసిల్ల పట్టణానికి చెందిన కొంపల్లి వీణ ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022- 2023 సంవత్సరం బ్యాచ్‌లో అత్యధిక మార్కులు సాధించిన కొంపల్లి వీణ బంగారు పతకానికి ఎంపికైందని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించింది. నవంబర్ 7న జరిగే స్నాతకోత్సవంలో వీణకు బంగారు పతకాన్ని అందజేయనున్నారు.