మార్చిలోపు సర్కారు చేతికి మెట్రో

మార్చిలోపు సర్కారు చేతికి మెట్రో

హైదరాబాద్ మెట్రోకు వచ్చే మార్చి నెల కీలకం కానుంది. మొదటి దశ మెట్రో నిర్వహణను మార్చి 31 లోగా ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌అండ్‌టీ అంగీకరించడంతో ప్రతిష్ఠంభన తొలగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 8 విస్తరణ మార్గాలపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామన్నారు.