'జాగృతి ఆవిర్భావ సభను జయప్రదం చేయండి'
KNR: తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్న తరుణంలో ఈనెల 25న నిర్వహించే సభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నుండి 2,000 మందిని తరలించేలా మండలాల వారీగా బాధ్యులను నియమించామని పేర్కొన్నారు.