అవసరానికి మించి ఇంధనం నిలువ చేయొద్దు: సీపీ
PDPL: పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా ప్రజలు ఎక్కువ ఇంధనం నిల్వ చేసుకోవడంతో రద్దీ పెరుగుతుందన్నారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయవద్దని, నిర్ధారించని సమాచారాన్ని నమ్మవద్దని సీపీ తెలిపారు.