రికార్డు ధర పలికిన పులస

KKD: గోదావరిలో గౌతమీ మత్స్యకారుల వలకు చిక్కిన ఓ పులస వేలంలో రూ. 29 వేల ధర పలికింది. యానాంలోని రాజీవ్ బీచ్‌లో మంగళవారం చేపల వేలం నిర్వహించారు. ఈ వేలంలో 1.515 కిలోల పులస చేపను చొల్లంగి ఎదళ్లయ్య అనే మత్స్యకారుడు కొనుగోలు చేశాడు. అలాగే, 1.400 కేజీల మరో పులస చేపను రూ. 28 వేలకు పోయింది. వరద ప్రవాహం తగ్గితే పులసలు దొరికే అవకాశం ఉందని మత్స్యకారులు తెలిపారు.