VIDEO: వినాయకుడికి పెన్నులతో అభిషేకం
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బాల వినాయకుని స్వామి ఆలయంలో శనివారం ఉదయం పెన్నులతో స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు మొదలవుతున్న నేపథ్యంలో పరీక్షలు రాయబోయే విద్యార్థులు తమ పెన్నులను అభిషేకంలో ఉంచారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం పెన్నులను విద్యార్థులకు అందజేశారు.