సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
కృష్ణా: గుడ్లవల్లేరులో సోమవారం డీఎస్పీ ధీరజ్ వినీల్ విద్యార్థులకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలికలు అనుచిత సంఘటనలు ఎదురైతే ఎలా స్పందించాలో, సైబర్ మోసాల నుంచి ఎలా జాగ్రత్త పడాలో వివరించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి కూడా విద్యార్థులకు తెలిపారు.