పోగొట్టుకున్న బ్యాగ్, మొబైల్ ఫోన్ అందజేత..!
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ ప్రయాణికుడు బ్యాక్ పోగొట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, తగిన చర్యలు చేపట్టి బ్యాగ్‌ను యజమానికి అప్పగించారు. దీని విలువ సుమారుగా రూ. 1.15 లక్షలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్ సహా ఇతర విలువైన వస్తువులు బ్యాగులో ఉన్నట్లు సదరు ప్రయాణికుడు పోలీసులకు వివరించారు.