జిల్లాలో రేషన్ బియ్యం కోసం క్యూ

జిల్లాలో రేషన్ బియ్యం కోసం క్యూ

WGL: జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ లబ్ధిదారులకు చుక్కలు చూపుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కోటాను ప్రభుత్వం ఒకేసారి ఇస్తుండగా, ప్రతి నెలకు వేర్వేరుగా తంబ్ వేయాల్సి వస్తోంది. దీంతో పంపిణీ ఆలస్యమై ఎండలో గంటల తరబడి నిలబడలేక జనం అవస్థలు పడుతున్నారు. ఒకే తంబుతో బియ్యం ఇచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి తమ కష్టాలు తీర్చాలని కార్డుదారులు కోరుతున్నారు.