మహిళను మోసం చేసిన వ్యక్తికి జైలు శిక్ష
VZM: నమ్మించి మహిళను మోసం చేసిన కేసులో నిందితుడికి మహిళా కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. బండి సంచిత్ అనే వక్తి బూర్లిపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో పలుమార్లు శారీరకంగా వాడుకుని మోసం చేశాడు. సదరు మహిళ ఫిర్యాదుతో పీఎస్‌లో కేసు నమోదు చేయగా ఇవాళ శిక్ష పడినట్లు డీఎస్పీ గోవిందరావు తెలిపారు.