మామిడాలలో మహిళ సూసైడ్

మామిడాలలో మహిళ సూసైడ్

NLG: వివాహిత ఆత్మహత్య చేసుకున్నసంఘటన తిప్పర్తి మండలం మామిడాలలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తీగల జానకమ్మ రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. భార్య భర్తలు ఇద్దరు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తల్లి బచ్చలకూరి లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.