16న మహాసభలు: సీఐటీయూ

GDWL: ఆగస్టు 16న గద్వాలలో జరిగే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా మహాసభలను నిర్వహించనున్నారు. గద్వాల జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ హాజరై జయప్రదం చేయాలని యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏ. వెంకటస్వామి, అధ్యక్షుడు గట్టన్న కోరారు. బుధవారం అలంపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నాలుగు నెలల బకాయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.