రాజ్యాంగ దినోత్సవ సభ గోడపత్రిక ఆవిష్కరణ
కోనసీమ: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగే సభను విజయవంతం చేయాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రవితేజ పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఇవాళ ఆసుపత్రిలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కారెం వెంకటేశ్వరరావు, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.