విశాఖ చేరుకున్న మంత్రులు
VSP: కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత శనివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా కాశీబుగ్గకు బయలుదేరారు.