కలకలం సృష్టిస్తున్న పెద్దపులి సంచారం
SRCL: వీర్నపల్లి, కోనరావుపేట సరిహద్దుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్, KNR జిల్లాల అటవీ ప్రాంతం పులికి ఆవాసయోగ్యం అయినందున అధికారుల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పొలాల వద్ద త్రీ ఫేజ్ విద్యుత్ నిలిపివేస్తున్నామని, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.