అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్

KNR: బొమ్మకల్ లారీ అసోసియేషన్ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చేగుర్తి గ్రామానికి చెందిన బాబు, రమేష్, ట్రాక్టర్ యజమాని కుర్ర రాజేశం ఆదేశాల మేరకు మానేరు నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.