బెంగాల్‌లో కాంగ్రెస్ ‘కీ’ రోల్ ప్లే చేస్తుందా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత వైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చరిత్ర ఉన్న హస్తం పార్టీ, ముఖ్యంగా మాల్దా, ముర్షీదాబాద్, నదియా వంటి జిల్లాల్లో ఇప్పటికీ పటిష్టమైన కేడర్ ఉండటంతో వాటిపైనే ఆశలు పెట్టుకుంది. TMC, BJPల మధ్య సాగుతున్న పోరులో తన ఉనికిని చాటుకుని, కీలక శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది.