ఆమె సాక్ష్యంతోనే పోలీసులకు మరణశిక్ష..!
తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో హెడ్ కానిస్టేబుల్ రేవతి సాక్ష్యం కీలకంగా మారింది. పోలీసులు తండ్రీకొడుకులను ఎంత దారుణంగా హింసించారో రేవతి మేజిస్ట్రేట్ ముందు వివరించారు. తన పిల్లల రక్షణపై హామీ పొందాకే ఆమె వాంగ్మూలంపై సంతకం చేశారు. రేవతి ధైర్యం వల్లే 9 మంది పోలీసులకు మరణశిక్ష పడింది.