'జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించాలని వినతి'
SKLM: జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించాలంటూ మెలియాపుట్టి తహసీల్దార్ బీ.పాపారావుకు మంగళవారం జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. 2019 వరకు రాష్ట్రంలో 20వేల మంది అక్రిటిడేషన్ జర్నలిస్టులు ఉండగా, పలు నిబంధనల పేరుతో 9 వేలు మందికి మాత్రమే అక్రిడేషన్ గత ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో ఇంత వరకు శాశ్వత అక్రిడేషన్లు మంజూరు చేయకుండా నెలలు పెంచుతున్నారు.