బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకస్మిక తనిఖీ
నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం కోవూరులోని బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులు ఆరుబయట కూర్చుని భోజనం చేయడంచూసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి త్వరలోనే పాఠశాల ఆవరణలో అత్యాధునిక డైనింగ్ హాల్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు.