వృద్ధురాలి మెడలో చైను లాక్కెళ్లిన దుండగుడు

వృద్ధురాలి మెడలో చైను లాక్కెళ్లిన దుండగుడు

ప్రకాశం: చీమకుర్తి మండలం మైలవరం గ్రామంలో శనివారం పట్ట పగులే దొంగలు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ తన ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా ఓ యువకుడు వచ్చి మంచినీళ్లు తాగాలని నీళ్లు అడిగి మహిళ మెడలో నుంచి మూడు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.