మీ ఓటు ప్రశ్నించే గొంతుక కావాలి అనే పోస్టర్ ఆవిష్కరణ
KNR: హామ్ ' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ' మీ ఓటే ప్రశ్నించే గొంతుగా కావాలి' అనే నినాదంతో కూడిన వాల్ పోస్టర్ను రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, దానిని ప్రతి ఒక్క ఓటర్ వినియోగించుకోవాలని అన్నారు. డబ్బుకు ప్రలోభపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచరు.