కాకినాడ యువతులకు అండగా DY.CM పవన్
KKD: జగన్నాథపురానికి చెందిన జనసేన కార్యకర్త మల్లాడి రాజు కుమార్తెలు, మల్లాడి గీతాశ్రీ, జయశ్రీలు తమను ఆదుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా DY.CM పవన్ ను కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. వారికి అండగా నిలవాలని ఎమ్మెల్సీ నాగబాబును ఆదేశించారు. దీంతో వారి చదువులు, పెళ్లి దృష్టిలో ఉంచుకుని తండ్రితో మాట్లాడుతామని స్థానిక జనసేన నేతలు అన్నారు.