లింకు రహదారులకు నిధులు మంజూరు
KMM: బోనకల్ మండలంలోని లింకు రహదారుల అభివృద్ధికి, బీటీ రహదారుల నిర్మాణం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రూ. 16.35 కోట్ల నిధులు మంజూరు చేశారని పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిషోర్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు తెలిపారు. మండలంలోని ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, చిరునోముల గ్రామాల్లో లింకు రోడ్లకు ఈ నిధులు మంజూరు అయ్యాయి.