VIDEO: భీమవరం బస్టాండ్‌లో కలెక్టర్ తనిఖీలు
W.G: భీమవరం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.14.5 లక్షలతో నిర్మించిన నూతన మరుగుదొడ్లను కలెక్టర్ నాగరాణి శనివారం ప్రారంభించారు. బస్టాండ్‌లో పర్యటించి స్టాళ్లను, మౌలిక వసతులను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికులతో మాట్లాడి ఆరా తీశారు. పాలకొల్లు బస్టాండ్ పై ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.