VIDEO: 'చందంపేటలో పరిశ్రమకు అనుమతులు లేవు'
MDK: చిన్నశంకరంపేట మండలం చందంపేటలో ప్రతిపాదిత పరిశ్రమకు గ్రామస్థులు గట్టి వ్యతిరేకత వ్యక్తం చేశారు. గ్రామసభలో ఏకగ్రీవంగా అనుమతులు ఇవ్వవద్దని తీర్మానించారు. పర్యావరణ కాలుష్యం, ఆరోగ్య సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తమ హయాంలో అనుమతులు ఇవ్వబోమని సర్పంచ్ స్పష్టం చేశారు.