ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NLG: నల్గొండలోని లైన్ వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న మందులు, నమోదైన హై రిస్క్ కేసులు, ప్రసవ కేసుల నమోదును పరిశీలించారు. క్యాలెండర్ ప్రకారం చికిత్స అందిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకున్నారు. లైన్ వాడ వార్డులో జనాభా ఎక్కువగా ఉన్నందున మరో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు.