ముందస్తు ఆస్తిపన్నుకు విశేష స్పందన
PLD: చిలకలూరిపేటలో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న 5% రాయితీని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఏప్రిల్ 30 వరకు ఈ అవకాశం ఉంటుందని రెవెన్యూ అధికారి సుబ్బారావు తెలిపారు. బుధవారం మధ్యాహ్నానికే రూ.9 లక్షల పన్ను వసూలైందన్నారు. ప్రజలు ఆన్‌లైన్ లేదా సచివాలయాల్లో పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలన్నారు.