అందుబాటులో ఈ క్రాప్ నమోదు జాబితాలు
AKP: పాయకరావుపేట మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద ఈ క్రాఫ్ట్ నమోదు జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి ఆదినారాయణ తెలిపారు. పెదరామభధ్రపురం, సత్యవరం, శ్రీరాంపురం,పాల్తేరు తదితర రైతు సేవా కేంద్రాల్లో జాబితాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలు ఉంటే రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించాలన్నారు.