'ఢిల్లీని ఆక్రమిస్తాం'.. పాక్ ఉగ్రవాది వ్యాఖ్యలు
ఢిల్లీని ఆక్రమిస్తామంటూ లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ రెచ్చిపోయాడు. హఫీజ్ సయీద్ సన్నిహితుడైన ఇతను.. ఢిల్లీని 'పెళ్లికూతురు'గా మారుస్తాం (స్వాధీనం చేసుకుంటాం) అని సవాల్ విసిరాడు. కాశ్మీర్‌లో పోరాటం ఆగలేదని, ఇకపై దాడులు తీవ్రమవుతాయని వార్నింగ్ ఇచ్చాడు. భారత ఎయిర్ ఫోర్స్‌పై కూడా నోరు పారేసుకున్నాడు. ఢిల్లీని స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూప్ లక్ష్యమన్నారు.