'వెంకన్న హుండీ లెక్కింపు'

'వెంకన్న హుండీ లెక్కింపు'

W.G: కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. భీమవరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీ దండు వెంకట కృష్ణంరాజు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 83 రోజులు గాను రూ. 17,09,477 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎం అరుణ్ కుమార్ తెలిపారు.