బాలికల వసతి గృహ భవనాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో 135.00 లక్షల రూపాయల సమగ్ర శిక్ష నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదులు, వసతి గృహ భవనాన్ని శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్‌తో కలిసి ప్రారంభించారు.