వాళ్లను రోకలి బండతో కొట్టండి: MLA సంజయ్
TG: MLA కల్వకుంట్ల సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్లని రోకలి బండతో కొట్టండంటూ ప్రజలకు సూచించారు. కావాలంటే తమ తరపున ఆయనే జైలుకు వెళ్తానన్నారు. పథకాల కోసం ఎవ్వరికీ కూడా డబ్బులు ఇవ్వొద్దని చెప్పారు. ఇట్లాంటి దొంగలు ఉంటారని తెలిసే KCR, పథకాల డబ్బులను నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ చేసేవారని పేర్కొన్నారు.