ప్రజలు రిగ్గింగ్, అరాచకాలకు చరమగీతం పాడారు: దేవినేని

ప్రజలు రిగ్గింగ్, అరాచకాలకు చరమగీతం పాడారు: దేవినేని

NTR: పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నిక ఫలితాలు జగన్‌కు చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. గురువారం గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 74% పైగా ఓటింగ్‌తో ప్రజలు రిగ్గింగ్, అరాచకాలకు చరమగీతం పాడారని చెప్పారు. కూటమి సుపరిపాలన, సూపర్ సిక్స్ హామీల అమలుతో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.