గంజాయితో పట్టుబడిన కానిస్టేబుల్స్

గంజాయితో పట్టుబడిన కానిస్టేబుల్స్

VSP: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 కిలోల గంజాయిని, ఒక కారును సీజ్ చేశారు. నిందితుల్లో ఇద్దరు విజయనగరానికి చెందిన కానిస్టేబుళ్లని పోలీసులు తెలిపారు. వీరితో పాటు మాజీ APSP కానిస్టేబుల్ శివప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యారు. గతంలో గంజాయి నేరాలకు పాల్పడిన కారణంగా శివప్రసాద్‌ అప్పట్లోనే సస్పెండ్ అయ్యాడు.