ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి

NDL: ముస్లింలు అత్యధికంగా నివసించే బనగానపల్లె పట్టణం మొహరం వేడుకలకు ప్రసిద్ధి చెందిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆస్థానంలో కొలువుదీరిన బంగారు పీర్లకు మంత్రి పూజలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మొహరం వేడుకలకు ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షలు నిధులు విడుదల చేయించడం పట్ల ముస్లింలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.