OTTలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్
తమిళ హీరో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 28 నుంచి తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రవీణ్ కె తెరకెక్కించగా.. సెల్వరాఘవన్, శ్రద్ధ శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రలు పోషించారు.