అగ్నిప్రమాదంలో మరో వ్యక్తి మృతి

అగ్నిప్రమాదంలో మరో వ్యక్తి మృతి

అమెరికా అల్బనీ ప్రాంతంలోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన అన్వేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సహజారెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే.