పేలుడు ఘటనపై స్పందించిన హోంమంత్రి
కృష్ణా: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడులో గాయపడిన ఎస్సై దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, ఇతర సిబ్బందికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారిని విజయవాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు.