VIDEO: మంటల్లో దగ్ధమైన ఆలయం

W.G: మొగల్తూరులో పూరి గుడిసెలో కొనసాగుతున్న శ్రీనడివీధి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం మంటల్లో దగ్ధమైంది. వేకువ జామున అమ్మవారికి పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు ఈఘటనను చూసి ఆవేదనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారికి ఆలయానికి నిప్పంటించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై చర్యలు చేపట్టాలంటూ భక్తులు కోరుతున్నారు.