పించన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
PLD: కారంపూడి ఎన్టీఆర్ బీసీ కాలనీలోని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ పింఛన్లు చేరేలా కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తారీఖునే ప్రజలందరికీ పింఛన్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.