బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి

వరంగల్: మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సీతారాం నాయక్ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గోకుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని ఇటుకలపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.