బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA
MDK: నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన లాలాగౌడ్ విద్యుత్ షాక్‌తో నిన్న మృతి చెందాడు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఇవాళ లాలాగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బచ్చురాజుపల్లిలో మల్లయ్య మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.