మానవత్వం చాటుకున్న వైరా ఎస్సై

మానవత్వం చాటుకున్న వైరా ఎస్సై

KMM: వైరా మండలం స్టేజి పినపాక గ్రామం వద్ద గత కొద్దిరోజులుగా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఓ మానసిక దివ్యాంగుడిని గమనించిన వైరా ఎస్సై పుష్పాల రామారావు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రముఖ సామాజిక సేవా సంస్థ అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించి ఆయన సమక్షంలో బాధితుడిని అప్పగించారు. దీంతో ఎస్సైని పలువురు అభినందిస్తున్నారు.