'అవినీతిని నిర్మూలిద్దాం - దేశాన్ని అభివృద్ధి చేద్దాం'
JGL: అవినీతిని నిర్మూలిద్దాం - దేశాన్ని అభివృద్ధి చేద్దామని, అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చన్నారు.